Tuesday, 3 November 2026

కొడారి రాజు ఆధ్వర్యంలో దసరా ఆయుధపూజ, బతుకమ్మ సంబరాలు.

సికింద్రాబాద్ (జనం సాక్షి ): సికింద్రాబాద్ బౌద్ధ నగర్ డివిజన్  వార్డ్   ఆఫీసులో    భాగ్యనగర్  మున్సిపల్ ఎంప్లాయ్ యూనియన్     సికింద్రాబాద్ అధ్యక్షుడు  కొడారి రాజు   ఆధ్వర్యంలో   బతుకమ్మ సంబరాలు, ఆయుధపూజ  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా   భాగ్యనగర్ మున్సిపల్  ఎంప్లాయ్  యూనియన్  అధ్యక్షుడు  సంజయ్ కుమార్ హాజరై పూజలు నిర్వహించాడు .  కొడారి  రాజు   మాట్లాడుతూ   జీఎస్ఎంసి కార్మికుల జీవితాల్లో   దసరా నుండి   వెలుగు నిండాలని   అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందులు, సూపర్డెంట్ పద్మ ,  వర్కింగ్ ప్రెసిడెంట్   శ్రీధర్ గౌడ్ ,   మహిళలు పాల్గొన్నారు.