మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం సహాయం చేసిన కంది కృష్ణ చైతన్య రెడ్డి
జనం సాక్షి,చెన్నారావుపేట
మండల కేంద్రానికి చెందిన ముద్దునూరి మీనయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు.మృతుని మరణ విషయం తెలుసుకున్న తెరాస నాయకుడు కంది కృష్ణ చైతన్య రెడ్డి శనివారం గ్రామానికి చేరుకుని మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబానికి తనవంతుగా 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం చేశారు.అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడవద్దని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.కాగా గతంలో మృతుని కుమారుడు ముద్దునురి అశోక్ మరణించిన సమయంలో అతని కుటుంబానికి కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో 60 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ పరామర్శ లో జెడ్పి కో-ఆప్షన్ సభ్యులు ఎండి.రఫీ,మాజీ ఎంపిటిసి మాదాసి కుమారస్వామి,గ్రామ తెరాస అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య,తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు మూడు రమేశ్,గ్రామ తెరాస ఎస్.సి.సెల్ అధ్యక్షుడు నర్మెట్ట సాంబయ్య, యాకుబ్,కిరణ్,సన్నీ తదితరులు పాల్గొన్నారు.