కొత్తకొండలో ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారుల సర్వే..

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (22)
జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో సర్వేనెంబర్ 2,లో ,564 లో రెవెన్యూ అధికారులు సర్వే జరిపించగా రెండు ఎకరాల 29 గుంటలు ప్రభుత్వ భూమిగా తేలిందని తాసిల్దార్ ఉమారాణి అన్నారు. డంపింగ్ యార్డ్ తో పాటు క్రీడా ప్రాంగణానికి నర్సరీకి ఈ స్థలాన్ని కేటాయిస్తున్నట్లు తాసిల్దార్ తెలిపారు. గతంలో కొంతమంది ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకున్న టువంటి స్థలం విషయంలో అధికారుల ఆదేశాల మేరకు సర్వే  జరిపించామని తాసిల్దార్ ఉమారాణి తెలిపారు