Wednesday, 4 November 2026

కొత్త జడ్పీల ఏర్పాటు తరవాతనే ఎన్నికలు

పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన తరవాత కసరత్తు
హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయగా.. జిల్లా పరిషత్‌లను మాత్రం ఉమ్మడిగానే కొనసాగిస్తున్నారు. వీటి కాలపరిమితి కూడా త్వరలోనే ముగియనుంది. ఇప్పటికే 31 జిల్లాలు ఏర్పడగా మరో రెండు జిల్లాలు కూడా ఏర్పడబోతున్నాయి. సిఎం కెసిఆర్‌ హావిూతో ములులగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుకు కసరత్తు సాగుతోంది. అయితే జడ్పీలను కూడా కొత్తగా ఏర్పాటు చేసిన తరవాత ఎన్నికలకు వెళతారా లేక ఉమ్మడిగానే కొనసాగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. జిల్లాల విభజనతో ఒక్కో నాలుగు జిల్లాలుగా ఏర్పడింది. దీంతో పూర్వపు జిల్లాలు  ఇకపై నాలుగు జడ్పీలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటి వరకు జడ్పీ సర్వసభ్య సమావేశాలన్ని ఉమ్మడిగానే  నిర్వహిస్తుండగా.. దూరభారంతో సభ్యులు, అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కావడం లేదు. దీంతో తాజాగా నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జిల్లా పరిషత్‌ల విభజన కూడా పూర్తి చేస్తారని సమాచారం.  కొత్త
జిల్లాల్లో కొత్తగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న జడ్పీ సిబ్బందిని అన్ని జిల్లాల జడ్పీ కార్యాలయాలకు సర్దుబాటు చేసి.. కార్యాలయాల నిర్వహణ, కార్యకలాపాలు కొనసాగిస్తారు. ఉమ్మడి జిల్లా విశాలంగా ఉండడంతో.. సభ్యులు ఎక్కువగా ఉండడం, జిల్లాల వారీగా అన్ని శాఖల అధికారులు ఉండడంతో.. సమావేశాలు రోజంతా, ఒక్కోసారి రెండు రోజులు నిర్వహించాల్సి వచ్చేది. ఇకపై జిల్లాకో జడ్పీ ఏర్పాటు చేయడంతో.. విస్తీర్ణం, సభ్యులు, అధికారులు తక్కువగా ఉండనున్నారు. దీంతో అన్ని శాఖలపై సమగ్ర చర్చకు అవకాశం లభించనుండడంతో పాటు ఒకే రోజు పూర్తి చేసే వీలుంటుంది. ప్రతి జడ్పీలో 15-20 మందిలోపే సభ్యులు ఉండనున్నారు. జడ్పీ విభజనకు సంబంధించిన పక్రియ లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రాకముందే పూర్తి చేసే అవకాశాలున్నాయి. 2014 ఏప్రిల్‌లో జడ్పీ ఎన్నికలు నిర్వహించగా.. జూన్‌లో ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటించారు. జూలై వరకు పాలక వర్గాల గడువు ఉన్నప్పటికీ.. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత జడ్పీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్ణీత గడువు
ప్రకారం 2019, ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కొన్ని జిల్లాలో కొత్త మండలాలు ఏర్పాటు చేసినందున.. ఆ ప్రకారంగా మండల పరిషత్‌ల సంఖ్య కూడా పెరుగనుంది. కొత్త మండలాల్లో మండల పరిషత్తు కార్యాలయాలు లేవు. పాత మండలాల్లోనే మండల పరిషత్తు కార్యాలయాలు ఉండగా.. కొత్తగా మండల పరిషత్‌ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఎంపీడీవోల నియామకం చేయాల్సి ఉంది. కొత్త మండలాల ప్రకారం మండల పరిషత్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పక్రియ పూర్తి చేసే దిశగా అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల్లో మాదిరిగానే రిజర్వేషన్లు అయిదేళ్లకు బదులుగా.. ఇకపై పదేళ్లు అమలు చేయనున్నారు. అంటే ప్రస్తుతం నిర్ధారించే రిజర్వేషన్లు రెండు విడతలు అంటే.. 2029 వరకు వర్తిస్తాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల రహితంగా నిర్వహించగా.. పరిషత్‌ ఎన్నికలను మాత్రం పార్టీ గుర్తులపై నిర్వహిస్తారు. దీంతో పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలో పోటీ పడే అవకాశాలున్నాయి. జిల్లా పరిషత్‌ విభజనతో పాటు కొత్త మండలాలకు మండల పరిషత్‌ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పంచాయితీ అధికారులు అన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే.. ఈ పక్రియ చేపడుతామన్నారు. ఇప్టపికే సవిూకృత కలెక్టరేట్ల నిర్మాణాలు పూర్తికావస్తున్నాయి. ఇందులోనే జడ్పీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. బహుశా జడ్పీ ఎన్నికలను పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన తరవాతనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.