Wednesday, 4 November 2026

కొత్త జొన్నవంగడాలను ఆవిష్కరించిన ఇక్రిశాట్‌

హైదరాబాద్‌,జూలై5(జ‌నం సాక్షి ): కొత్తరకం జొన్న వంగడాలను ఇక్రిశాట్‌ ఉత్పత్తి చేసింది. ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవిగా ప్రకటించింది. పటాన్‌ చెరులోని ఇక్రిశాట్‌లో బయో ఫొర్టిఫికేషన్‌ పద్ధతిలో పర్భని శక్తి పేరుతో జొన్న రకం ఉత్పత్తులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వీటా ఐరన్‌ జింక్‌ లోపాలను ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి బయో ఫొర్టిఫికేషన్‌ ఒక నూతన పద్ధతిని ఆవిష్కరిస్తున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన యూనివర్సిటీ ఇక్రిశాట్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. విఎన్‌ఎం కె వి వైస్‌ ఛాన్సిలర్‌ ప్రొఫెసర్‌ ఏఎస్‌ ధావన్‌, డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పీటర్‌ కార్బరీ, ఇక్రిశాట్‌ జొన్న ప్రధాన శాస్త్రవేత్త అశోక్‌ కుమార్‌, మహారాష్ట్రకు చెందిన రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ రకం జొన్నలలో ఐరన్‌ జింక్‌ పౌష్టికాలు విరివిగా లభ్యమవడంతో పాటు ఎకరానికి 18 నుండి 20 క్విటాళ్ల ఉత్పత్తితో లాభాలు గడిస్తున్నారని పలువురు వ్యవసాయ నిపుణులు ఈ సెమినార్‌ లో తెలిపారు.