Thursday, 5 November 2026

కొత్త నటీనటులతో ‘ హైదరాబాద్‌ టు వైజాగ్‌’

హైదరాబాద్‌: కొత్త నటీనటులతో ఎస్‌ మూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌ టు వైజాగ్‌’ అనిల్‌, అజయ్‌, విసికా సింగ్‌, అంజలి అనే నలుగురు కొత్త నటులతో తెరకెక్కుతున్న సినిమాకు నిర్మాత వసంత్‌ స్వయంగా దర్శికత్వం వహిస్తున్నారు. నేటితరం యువత గమనం, చెడు మార్గాలకు అలవాటు పడుతున్న  వైనం ఈ చిత్రంలో చూపించనున్నారు. చిత్రం షూటింగ్‌ ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ‘మా’ అధ్యక్షుడు మురళీ మోహన్‌ తొలిషాట్‌కు క్లాప్‌ ఇవ్వగా రామనాయుడు కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *