హైదరాబాద్: తెలంగాణ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర, దక్షిణ కోస్తాల్లో భారీ వర్షలు పడే అవకాశం ఉంది. తెలంగాణ రాయలసీమలో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది మృతి చెందగా, ఖమ్మంలోనే నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలియజేశారు.




