హైదరాబాద్: 14 జిల్లాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతొంది. మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రలు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపును కరీంనగర్ అంబేద్కర్ భవన్‌లో చేపట్టారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ విశాఖలో జరుగుతోంది. ఉభయగోదావరి పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కాకినాడ రంగరాయ వైద్యకళాశాలలో ఉదయం ప్రారంభమైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లను నల్గొండలో లెక్కిస్తున్నారు. లేక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.




