Tuesday, 3 November 2026

ఆందోళనల మధ్య బహిరంగ విచారణ ప్రారంభం

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఫ్యాప్సీ భవన్‌లో ఆందోళనల మధ్య ఈఆర్‌సీ బహిరంగ విచారణ ప్రారంభమైంది. ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు, పలు ప్రజాసంఘాలు విచారణ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలు అక్రమమంటూ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పాల్గొన్నారు. ఫ్యాప్సీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *