Wednesday, 4 November 2026

కొనసాగుతున్న దర్యాప్తు : కేసులు సీఐడీకీ బదిలీ

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఎన్‌ఐఏ, ఆక్టోపన్‌, ఫోరన్సిక్‌ సిబ్బంది ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. అనుమానితుల గురించి వివరాల సేకరణలో సిబ్బంది నిమగ్నమయ్యారు. పేలుళ్లకు ఐఈడీ వాడినట్లు దర్యాప్తు అధికారులు ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. మరోవైపు ఈ ఘటనపై సరూర్‌నగర్‌, మలక్‌పేట పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను సీఐడీ విభాగానికి బదిలీ చేశారు. ఘటన చోటుచేసుకునే సమయానికి ముందు ఇక్కడ అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. జాతీయ దర్యాప్తు బృందం డీజీ ఎన్‌.పి. సిన్హా డీజీపీ దినేశ్‌రెడ్డిని కలిసి ఘటనపై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *