*కొమురమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి*
*దేవరుప్పుల ,జులై 27 (జనం సాక్షి):* మండలం, కడవెండి గ్రామానికి చెందిన ‘మాజీ సర్పంచ్, తెరాస మండల అధికార ప్రతినిధి సుడిగెల హన్మంత్’ తల్లి ‘సుడిగెల కొమురమ్మ’ నాలుగురోజుల క్రితం మరణించగా వారి స్వగ్రామానికి వచ్చి వారి కుటుంబాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.తదనంతరం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొమురమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.మంత్రి దయాకర్ వెంట ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.
Attachments area