Monday, 2 November 2026

కోటిపల్లి నుంచి జడ్పీటిసిగా గెలిపించండి: సునీతా

వికారాబాద్‌,మే3(జ‌నంసాక్షి): తనను వికారబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా  ఎన్నుకుంటే అభివృద్దికి పాటుపడతానని రంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్‌ సునీతామ హేందర్‌రెడ్డి అన్నారు. నూతంగా ఏర్పడిన కోట్‌పల్లి మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని సునీతారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బషీరాబాద్‌ మండల పరిధిలోని కాశీంపూర్‌, మల్కన్‌గిరి గ్రామాల్లో సునీతారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి గొట్టుగకలాన్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులను ఉద్ధేశించి మట్లాడారు. కోట్‌పల్లి మండలం అంటేనే బంట్వారం మండలానికి చెందిన గ్రామాలన్నీ, గతంలో బంట్వారం మండలం నుంచి తనకు రాజకీయ జీవితం ఇచ్చిన మండలమని కొనియాడారు. ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలు తనకు ఎంతగానో ఉన్నాయన్నారు. బంట్వారం మండలం నుంచి ఎన్నికైన సందర్భంలోనే చైర్మన్‌గా అప్పుడే సుమారు రూ.3 కోట్ల నిధులను వెచ్చించి మండలాన్ని అభివృద్ధి చేశామన్నారు. తాను చేసిన అభివృద్ధిని చూసిన ప్రజలే నేడు తనకు అండగా ఉంటారనే నమ్మకంతో ఉందన్నారు. కోట్‌పల్లి మండలం నుంచి మరో మారు ప్రజలు గెలిపిస్తే మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.