Tuesday, 3 November 2026

కోటి రూపాయలతో మహాలక్ష్మి దేవి అలంకరణలో బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి…

కూకట్ పల్లి జనంసాక్షి :ఐదవ రోజు శ్రీ శ్రీ శ్రీ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో దర్శనమిస్తున్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి, కోటి రూపాయలతో మహాలక్ష్మి దేవిగా అమ్మవారిని అలంకరించారు. భక్తుల కోరికల తీరస్తూ కొంగుబంగారమై విరాజిల్లుతున్న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి భక్తులకు దర్శనం ఇచ్చింది. ఆలయ ఈఓ అన్నపూర్ణ, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, ప్రధాన అర్చకుడు అనిల్, రంగా చార్యులు తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రులను పురస్కరించుకుని ప్రతి రోజు అమ్మ వారిని చూడ ముచ్చటగా అలంకరించి భక్తులకు దర్శనం కలిపించడంతో పాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.