కోడవటంచ హుండీ ఆదాయం ₹16.18 లక్షలు
రేగొండ (జనం సాక్షి): కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం ₹16 లక్షల 80 వేల 827 వచ్చినట్లు ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆలయం లో హుండీ లను లెక్కించారు. ₹ 15 లక్షల 70 వేల 461 నోట్లు, 1లక్ష 10 వేల 366 నాణెం ల ద్వారా ఆదాయం వచ్చాయని ఈఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకులు అనిల్ కుమార్,ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాదాడి అనిత – కరుణాకర్ రెడ్డి, పోలీస్ అధికారులు రవీందర్, కిరణ్, ఆలయ ధర్మకర్తలు కుమారస్వామి, సుమన్, రాజేశ్వర్ రావు, శంకర్, నరేష్, గ్రామ పెద్దలు శివాజీ, భాస్కర్, ఓదెలు, సంపత్ రావు,నిమ్మల రాజు వారి భజన బృందాలు, భక్తులు పాల్గొన్నారు.