హైదరాబాద్,అక్టోబర్30(జనంసాక్షి): వైకాపా అధ్యక్షుడు జగన్ గాయాన్ని వైద్యులు ఈరోజు పరిశీలించారు. గాయం ఇంకా తగ్గలేదని, పూర్తిగా నయం కావడానికి ఆరువారాల సమయం పడుతుందని చెప్పారు. లోటస్ పాండ్‌లో ఆయన్ను పరిశీలించిన అనంతరం సిటీ న్యూరో సెంటర్ డాక్టర్ శివారెడ్డి విూడియాతో మాట్లాడారు. కోడికత్తితో చేసిన గాయంపై రక్త నమూనాల నివేదిక వచ్చిందని, అందులో ఎలాంటి విష నమూనాలు లేనట్లు గుర్తించామని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రకు వెళ్లాలనే అభిప్రాయంలోనే జగన్ ఉన్నారని,
అయితే కొన్ని జాగ్రత్తలతో కొనసాగించవచ్చని తాము చెప్పినట్లు శివారెడ్డి వివరించారు.




