Tuesday, 3 November 2026

టిఆర్‌ఎస్‌ ప్రభంజనంలో కూటమి గల్లంతు: పోచంపల్లి

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభంజనంలో మహాకూటమి కొట్టుకుపోతోందని శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సెటిలర్స్‌తో టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని, సెటిలర్స్‌ టీఆర్‌ఎస్‌తోనే ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సెటిలర్స్‌పై సవతితల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. శేరిలింగంపల్లి ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్లకు, అరికెపూడి గాంధీకి మధ్య అభిప్రాయభేదాలు లేవని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.