హైదరాబాద్: తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరామ్‌పై తెలంగాణ మంత్రులు చేస్తున్న దాడిని పౌరహక్కుల సంఘం ఖండించింది. తెరాస ప్రభుత్వం రెండేళ్లలో చేస్తున్న తప్పులను ఎత్తిచూపిన కోదండరామ్‌పై మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడటం సరికాదని ఆ సంఘం నేత హరగోపాల్ హితవు పలికారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాలన్నారు. కోదండరామ్ చేసిన విమర్శల్లోని వాస్తవాలను గ్రహించి లోపాలను సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం వ్యక్తిగత దూషణలు చేయడంపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్‌పై మంత్రులు చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.