Thursday, 5 November 2026

కోమటికుంట బడిలో విద్యార్థులే ఉపాధ్యాయులు

 

లింగాల జనం సాక్షి
లింగాల మండలం కోమటికుంట గ్రామంలో శుక్రవారం స్థానిక పాఠశాల ఆవరణలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. జిల్లా కలెక్టర్ గా_ సంకి త్రివేణి 7వ, జిల్లా విద్యాశాఖ అధికారి గా_ కడెం లావణ్య 7వ, మండల విద్యాధికారిగా_ ఇరగొట్టి శ్రావ్య 7వ, ప్రధానోపాధ్యాయులుగా_ బి అను 7వ,ఉపాధ్యాయులుగా 23 మంది విద్యార్థులు, పిటి లు గా_ డీ కరుణశ్రీ 5వ,స్వాతి 5వ,l పీటీలుగా బాధ్యతలు నిర్వహించారు .పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మాట్లాడుతూ చిన్నప్పటినుండే క్రమశిక్షణ అలవర్చుకుంటూ, ఒక క్రమమైన పద్ధతిలో చదువుకుంటే భవిష్యత్తులో మంచి భారత భావిభారత పౌరులుగా ఎదగవచ్చునన్నారు. గ్రామములో నిరక్షరాశులు చాలా మంది ఉన్నారు వీరిని అక్షరాస్తులుగా మార్చే బాధ్యత సమాజంలో ఉపాధ్యాయులది, పౌరులది అని అన్నారు. విద్యార్థులు వారు బోధించినటువంటి వివిధ అంశాలను వారి యొక్క అనుభవాలను చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ అంజిలాల్ ఉపాధ్యాయులు కే .తిరుపతి, ఏ .విజయ్, పి అనిల్, వి వెంకటేష్ అంగన్వాడి టీచర్ శ్రీమతి సువర్ణ గారు, తదితరులు పాల్గొని కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించినారు.