కోమటిరెడ్డి బ్రదర్స్ కి భారీ షాక్..

నిజామాబాద్ బ్యూరో,అక్టోబర్ 09(జనంసాక్షి): మునుగోడు నియోజకవర్గ పరిధిలో పలువురు బి ఆర్ ఎస్ లో చేరడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కు భారీ షాక్ తగిలిందని ఆర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.ఆదివారం సుమారు
_12500 రెవెన్యూ శివారు గల అతి పెద్ద గ్రామ పంచాయతీ  అయిన దండు మల్కాపుర్ గ్రామానికి ఇన్చార్జిగా వ్యవరిస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  సమక్షంలో ఆ ఊరి గ్రామ సర్పంచ్  నియోజకవర్గంలోనే  భారీ మెజారిటితో గెలుపొందిన  యాదగిరి మరియ వార్డ్ మెంబర్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బలవంత్ రెడ్డి లు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
_ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  చేస్తున్న అభివృద్ధి పనులకు అకర్షితులై పార్టీ లో చేరినట్టు ఆయన వివరించారు,స్వయంగా రైతు ఆయన సర్పంచ్ యాదగిరి బిజెపి ప్రభుత్వం వస్తే మోటర్లకు మీటర్లు పెట్టనున్న మోడీ ప్రభుత్వనికి మేము వ్యతిరేకమని ఫ్లోరోసిస్  నీటిని మొత్తం అరికట్టి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీటిని మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మునుగొడు నియోజకవర్గానికి రోల్ మోడల్ అని ఆయన పేర్కొన్నారు_
_దండి మల్కాపూర్ గ్రామములో ప్రజలందరూ కేసీఆర్ గారి వెంటనే ఉన్నట్టు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటితో గెలిపించనున్నట్లు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు తెలిపారు._
Attachments area