బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఉపసర్పంచ్ దంపతులు
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఎస్‌ఎల్బీ గార్డెన్‌లో జరిగిన సమావేశంలో మంథని మేజర్ గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ పుప్పాల బాగ్యలక్ష్మి తిరుపతి దంపతులు, విలోచవరం మాజీ ఎంపీటీసీ లక్కాకుల స్వామి 30 మంది అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌పార్టీలోచేరారు. పార్టీలో చేరిన వారికి తెలంగాణ తొలి శాసన సభాపతి,ఎమ్మెల్సీ సిరికొండ మధుసుధనాచారీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు అవలంభిస్తున్న తీరుకు విసుగు చెంది బీఆర్‌ఎస్ ప్రభుత్వం, జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చేస్తున్న అభివృధ్దికి ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు.