కోయగూడెం ఉపరితల గనిని పరిశీలించిన డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేఖర్
టేకులపల్లి, అక్టోబర్ 9( జనం సాక్షి ): సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్, పా) ఎస్ చంద్రశేఖర్ ఆదివారం కోయగూడెం ఉపరితల గనిని సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. కోల్ బెంజ్ తనిఖీ చేస్తూ రోజువారి బొగ్గు ఉత్పత్తి, ఓబి బ్లాస్టింగ్ జరుగుతున్న తీరును ,లోడింగ్ పనులను ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులను ఉద్దేశించి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా రోజువారి లక్ష్యాలను అధిగమించాలని, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏరియా జీ.ఎం. శాలెం రాజు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ పి శ్రీనివాసు, కొయ్యగూడెం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్ వి ఆర్ ప్రహ్లాద్, ప్రాజెక్ట్ ఇంజనీర్ శివశంకర్, మేనేజర్ సౌరబ్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.