Wednesday, 4 November 2026

కోయగూడెం ఉపరితల గనిలో ట్రేడ్ టెస్ట్ విజేతలకు బహుమతులు

కోయగూడెం ఉపరితల గనిలో ట్రేడ్ టెస్ట్ విజేతలకు బహుమతులు

టేకులపల్లి, డిసెంబర్ 15( జనం సాక్షి): ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఉపరితల గనిలో 53 వ వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా కేఓసి లోని వివిధ విభాగాల ఉద్యోగులకు, ప్రైవేటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిర్వహించిన ట్రేడ్ టెస్ట్ లో గెలుపొందిన ఉద్యోగులకు ఇల్లందు ఏరియా జి.ఎం. ఎం. షాలెం రాజు ముఖ్య అతిథిగా పాల్గొని గురువారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి భద్రతాపరంగా తమ విధులపై మరింత అవగాహన పెంపొందించుకోవాలని, తమ వృత్తి నందు నైపుణ్యాన్ని పెంచుకోవాలని కోరారు. సంస్థ నిద్దేశిస్తున్న లక్ష్యాలను భద్రతతో కూడిన ఉత్పత్తితో అధిగమిస్తున్న ఉద్యోగులను,అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏరియా సేఫ్టీ ఆఫీసర్ పి.శ్రీనివాసు, ప్రాజెక్ట్ అధికారి యన్. వి. ఆర్ ప్రహలాద్ ,గని మేనేజర్ సౌరబ్ సుమన్ , ప్రాజెక్ట్ ఇంజనీర్ శివ శంకర్,సేఫ్టీ ఆఫీసర్ కే యస్ న్ రాజు ,పర్సనల్ అధికారి కృష్ణ , గుర్తింపు సంఘం ఉపాధ్యక్షులు ఎస్. రంగనాథం , ఫిట్ కార్యదర్శి అశోక్ కుమార్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.