Wednesday, 4 November 2026

కోరమ్‌ లేక తొలి సమావేశం రద్దు

సిరికొండ: సిరికొండ సహకార సంఘం పాలక వర్గం మొదటి సమావేశం కోరమ్‌ లేక రద్దయ్యింది. ఈ సంఘ డైరెక్టర్లుగా గెలిచిన ఏడుగురు తొలి సమావేశం జరగకుండానే తమ పదవులకు రాజీనామా చేశారు. బుధవారం సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఛెర్మన్‌ గోపాల్‌తో పాటు నలుగురు డైరెక్టర్లు మాత్రమే హాజరయ్యారు. దీంతో సమావేశం కోరమ్‌ లేక రద్దు చేసినట్లు సొసైటీ కార్యదర్శి దశరథ్‌ తెలిపారు. తెరాస , తెదేపా కూటమిలో తెరాస అభ్యర్థిని సంఘం ఛైర్మన్‌గా ఎన్నుకోవాలని వీరి డిమాండు. ఈ కారణంగానే రాజీనామా చేసినట్లు వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *