Wednesday, 4 November 2026

పుట్టపర్తిలో పోలీసుల తనిఖీలు

మహంతి గదిలో కంప్యూటర్‌ స్వాధీనం
పుట్టపర్తి : బిట్టీ మహంతి కేసుకు సంబంధించి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కేరళ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ రోజు వారు పుట్టపర్తిలో బిట్టీ మహంతికి ఇల్లు అద్దెకు ఇచ్చిన రామారావును విచారించారు. మహంతి నివసించిన ఇంట్లో తనిఖీలు చేశారు.అతని గదిలో ఉన్న ప్రింటర్‌, స్టాంపులు, కంప్యూటర్‌లను కేరళ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న సామగ్రిని బట్టి చూస్తే ఉద్మోగానికి అవసరమైన డాక్యుమెంట్లను మహంతి స్వయంగా తయారు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *