సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు పంపిణీ

 

రుద్రంగి అక్టోబర్ 13 (జనం సాక్షి)
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయం చెక్కులను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దెగవత్ తిరుపతి,వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య గురువారం పంపిణీ చేశారు.రుద్రoగి మండలంలోని వీరుని తండా కు చెందిన గుగులోత్ భూపతి కి 20 వేలు మానాల గ్రామానికి చెందిన అల్లూరి గంగుకు 60 వేలు.పిడుగు చిన్న గంగారాంకు19 వేల రూపాయల చెక్కులను లభ్డిదారులకు అందచేశారు.అనంతరం మాట్లాడుతూ… పేద,మధ్య తరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత తెలంగాణ ప్రభుత్వం అందించాడం జరుగుతోందని తెలిపారు.మానాలలోనే అనేక మంది పేదలకు వైద్య సౌకర్యం కోసం గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం సహాయనిధి ద్వారా చెక్కులను వెనువెంటనే వచ్చేటట్లు సహాయం చూస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు నాయిని రాజేశం.లక్కకుల రమేష్,నరు నాయక్,కొమ్ముల తిరుపతి,కిమ్య,అల్లురి భూమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.