కౌన్సిలర్లు అందరూ తమ తమ వార్డులలోని ప్రజా సమస్యల పై దృష్టి సారించాలి

 – ఎమ్మెల్యే సైదిరెడ్డి
హుజూర్ నగర్ ఆగస్టు 9 (జనం సాక్షి): హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లు అందరూ తమ తమ వార్డులలోని ప్రజా సమస్యల పై దృష్టి సారించి వారికి నిత్యం అందుబాటు లో ఉండాలని హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ పురపాలక ప్రత్యేక సమావేశనికి ముఖ్య అతిధి గా హాజరై మాట్లాడుతూ ఇటీవల అకాల వర్షాలకు రోడ్లు గుంతలు పడి ఉంటే వెంటనే వారిని పూడ్చివేయాలని, వార్డులలో పరిశుభ్రంగా మైంటైన్ చెయ్యాలని సూచించారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంబరాలలో బాగస్వామం అయి ప్రతి ఇంటికి జాతీయ జెండా ను పంపిణీ చేసి ఇంటింటా జెండాను ఎగుర వేసేలా చూడాలని తెలియజేసారు. ప్రతి ఇల్లు బాగుంటే గ్రామాలు బాగుంటాయి అని గ్రామాలు బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి అని, రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుటుందని, ప్రతి ఒక్కరు రాష్ట్రం పట్ల, దేశం పట్ల బాధ్యత తో ఉంటూ , దేశాన్ని ప్రేమించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి,  ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు