పోస్టల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ఆజాదీకా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో  భాగంగా సూర్యాపేట పోస్టల్ ఉద్యోగులు మంగళవారం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి మీద ఆగస్టు 13 నుండి 15  వరకు జాతీయ జెండా ఎగరవేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.సూర్యాపేట పోస్టల్ డివిజన్ నందు ఇప్పటి వరకు సుమారు పదివేల జాతీయ జెండాలను విక్రయించినట్లు తెలిపారు.ఈ ర్యాలీలో భాగంగా ఉద్యోగులందరూ జాతీయ జెండాతో భారత్ మాతాకీ జై, హర్ ఘర్ తిరంగా అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో పోస్టల్ వెస్ట్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి , పోస్ట్ మాస్టర్ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.