రాత్రంతా ఓదార్చి కౌన్సిలింగ్ ఇచ్చినా లాభం లేకపోయింది
ఇప్పుడే వస్తానని చెప్పి ఆబిడ్స్‌కు వెళ్లి ఆత్మహత్య
హైదరాబాద్,జూన్5(జనం సాక్షి ): అబిడ్స్‌లో ఆత్మహత్య చేసుకున్న యువతి మృతితో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఆత్మహత్య చేసుకుంటుందని భావించలేదన్నారు. ధైర్యం చెప్పినా ఎందుకనో ఈ అఘాయిత్యానికి ఒడిట్టిందని అంటున్నారు. నీట్‌లో అర్హత సాధించలేదనే మనస్తాపంతో కాచిగూడకు చెందిన జెస్లిస్ కౌర్ (18) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారమే నీట్ ఫలితాలు వచ్చాయి. జెస్లిస్ కౌర్ అర్హత పొందలేదు. అప్పటినుంచి ఆమె ముభావంగా ఉంది. ఇంట్లోవాళ్లు సముదాయించిన పరిస్థితితో మార్పు రాలేదు. కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందిలే అని కుటుంబసభ్యులు అనుకున్నారు. కానీ.. ఇలా ప్రాణాలు తీసుకుంటుందని ఊహించలేకపోయారు. రాత్రంతా జెస్లిస్ కౌర్‌ను తల్లిదండ్రులు సముదాయించారు. ఫ్రెండ్స్ కూడా ధైర్యం చెప్పారు. కానీ తెల్లవారేసరికి ఘోరం జరిగిపోయింది.నిద్ర లేవగానే మామూలుగానే ఉన్న జెస్లిస్ కౌర్.. ఆ తర్వాత బయటకు వెళ్లివస్తానని చెప్పి ¬ండా యాక్టివ్‌పై అబిడ్స్‌కు వచ్చింది. అప్పటికే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న కౌర్ మయూరి కాంప్లెక్స్‌కు వచ్చింది. కాంప్లెక్స్ భవనాన్ని ఓసారి చూసిన ఆమె పై అంతస్తుకెక్కి దూకాలని నిర్ణయించుకుంది. ఆమె పైకి వెళుతున్నా ఎవరికి అనుమానం రాలేదు. ఒక్కసారిగా పైనుంచి జెస్లిస్ కౌర్ దూకడం… పెద్ద శబ్దం రావడంతో కలకలం రేగింది. అందరూ వచ్చి చూసేసరికి జెస్లిస్ కౌర్ రక్తపుమడుగులో ఉంది. 108 సిబ్బంది వచ్చేసరికి ఆమె ప్రాణాలు విడిచింది. మొదట అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు యాక్టివ్ ¬ండా నెంబర్ ఆధారంగా మృతి మిస్టరీని చేధించారు. కాచిగూడకు చెందిన జెస్లిస్ కౌర్‌గా గుర్తించారు. నీట్‌లో అర్హత సాధించనందునే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తేల్చారు. పరీక్ష తప్పానని, ర్యాంకులు రాలేదని, ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదని, విద్యాపరమైన ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. విద్యా సంస్థల ఒత్తిళ్లు, తల్లిదండ్రులు ఒత్తిల్లు ఇలా వివిధ రకాల కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. స్ధానికుల సమాచారం తో సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జెస్లీస్ కౌర్ తన స్కూటీపై మయూరీ కాంప్లెక్స్‌కు వచ్చి..ఐదో అంతస్థు వరకు వెళ్లినట్లు.. సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డు అయ్యాయని పోలీసులు తెలిపారు. కాంప్లెక్స్ పదవ అంతస్థు నుంచి యువతి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు.పది, ఇంటర్, ఎంసెట్, నీట్ పరీక్ష ఫలితాలతోపాటే విద్యార్థుల ఆత్మహత్యల వార్తలూ మామూలయ్యాయి. నాలుగు మార్కులు తక్కువయ్యాయని ఓ విద్యార్థి, ఫెయిల్ అయ్యానని మరో బాలిక, తల్లిదండ్రులు నిర్దేశిరచిన లక్ష్యం మేరకు ర్యాంకు సాధించలేకపోయానని మరో విద్యార్థి.. ఇలా ఆత్మహత్యలకు పాల్పడటం విషాదకరమైనవి. ఇటీవల విద్యార్థులపై చదువు ఒత్తిడి బాగా పెరిగింది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులకు శోకం మిగిల్చినవాళ్లవుతారని పోలీసులు సూచించారు.




