స్పా సెంటర్‌పై పోలీసుల దాడి
ఏడుగురి అరెస్ట్
హైదరాబాద్,జూన్19(జనం సాక్షి ): బ్యూటీ సెలూన్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్న స్పాపై పోలీసులు దాడి చేసారు. క్రాస్ మసాజ్ (పురుషులకు మహిళలు మసాజ్ చేయడం) చేస్తున్న కేంద్రంపై టాస్క్‌ఫోర్స్, నారాయణగూడ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. ఇందులో నిర్వాహకుడితో పాటు రిసెప్షనిస్టు, ఇద్దరు కస్టమర్లు, ముగ్గురు మహిళా వర్కర్లు ఉన్నారు. వారి నుంచి ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వైఎంసీఏ వద్ద గురుపర్హా ఎస్టేట్‌లో స్ల్ఫాష్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా పేరిట సాగుతున్న మసాజ్ సెంటర్‌లో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. 2015లో రాధారెడ్డి అనే మహిళ నెలకు రూ. 40వేల అ/-దదెకు తీసుకుని ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచే క్రాస్ మసాజ్ చేయిస్తున్నారు. ఆ కేంద్రం పై 2017 వరకు 3 కేసులు నమోదై ఉన్నాయి. ఆరు నెలలుగా ఆమె అల్లుడు, వైజాగ్ నివాసి గరిక సంతోష్ స్పా సెంటర్ బాధ్యతలు చేపట్టాడు. అతనిపై క్రిమినల్ కేసు ఉండటంతో యూపీఎస్‌సీలో ఉద్యోగం దొరకలేదు. దాంతో ఆర్థిక భారం పెరిగింది. అక్రమ సంపాదనపై దృష్టి సారించి క్రాస్ మసాజ్ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నాడు. ప్రత్యేకంగా ముగ్గురు బ్యూటిషియన్లను సమకూర్చుకుని వారి ద్వారా దందా సాగిస్తున్నాడు. నిందితుడుగతంలో కూడా ఓ సారి అరెస్టయినట్లు పోలీసులు చెప్పారు.




