Thursday, 5 November 2026

క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి

హైదరాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి):క్రీడలతో మనోవికాసంతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చని క్రీడా ప్రముఖులు అన్నారు. విద్యార్థులను చిన్నపటి నుంచే ఆయా క్రీడల్లో రాణించేలా తర్ఫీదు ఇవ్వాలని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, శారీరకధారుడ్యం పెరగడంతో పాటు మానసిక బలం పెరుగుతుందన్నారు. హాకీ క్రీడకు ప్రజాదరణ ఉందని, ప్రభుత్వాలు చేయూతనిస్తే రాష్ట్రంలో అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా టోర్నమెంట్లను నిర్వహిస్తున్నామని, నాణ్యమైన క్రీడాకారులను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణను అందించడం ద్వారా దేశస్థాయి పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటుతారన్నారు. క్రీడాభివృద్ధికి చేస్తున్న కృషిని ఇతర రంగాల వారు కూడా ప్రోత్సహించాలన్నారు.