క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి
45వ వార్డులో ఘనంగా క్రీడా పోటీలు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): స్వతంత్ర్య భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా బుధవారం స్థానిక 45వ వార్డ్ విద్యానగర్ లో ఆ వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. త్రో బాల్, కుర్చీ ఆట, టెన్నికాయిట్ పోటీలను నిర్వహించారు.విద్యార్థులతో పాటు వార్డు ప్రజలు కూడా ఈ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా
పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకలను సిఎం కెసిఆర్, మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు మేరకు వార్డులో ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు.ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసిన వార్డు ప్రజలు, ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు.అనంతరం విజేతలకు టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ , టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పిశిక వీరయ్య , లక్ష్మారెడ్డి, సత్యనారాయణ, రంగారెడ్డి , వెంకటరెడ్డి, మనోహర్, సురేష్, పాపయ్య , గిరి, సలీమ్ ,ఉపేంద్ర చారి,శ్రీనివాస్, ఉమా, సునీత, మంజుల, సాలయ్య , బిక్షం, వెంకటేష్, సందీప్ , కళ్యాణ్, ఇస్మాయిల్, నవీన్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.