నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి 24(జనంసాక్షి):
2019 జనవరి నుండి 2022 డిసెంబర్ వరకు పెద్దకొత్తపల్లి మండలం మారెడు మాన్ దిన్నె గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చినందుకు ఆ గ్రామ సర్పంచ్ గన్నోజు సునిత శ్రీకృష్ణ చారికి మండల స్థాయిలో క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు దక్కింది.ఈ అవార్డును ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ చేతుల మీదగా అందుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.ఇలాంటి సర్పంచ్ ను ఎన్నుకున్నందుకు మారెడు మాన్ దిన్నె గ్రామ ప్రజలు గర్వపడాలని అన్నారు.ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంతోమంది ఇబ్బందులు పెట్టినా సర్పంచ్ గా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రతి సర్పంచ్ ఇలాగే పని చేయాలని సూచించారు.ఈ అవార్డును అందుకున్నం దుకు గన్నోజు సునిత శ్రీకృష్ణ చారికి పలువురు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీఓ లక్ష్మణ్ ,దేవుని తిరుమలాపూర్ సర్పంచ్ వి సత్యం, గంట్రావుపల్లి సర్పంచ్ పగడాల చిన్నయ్య, పెరుమాండ్లపల్లి సర్పంచ్ మానస విష్ణు వర్ధన్ రెడ్డి, మారెడు మాన్ దిన్నె గ్రామ సెక్రెటరీ సల్లేశ్వరం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీకృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు.




