క్షణికావేశo అనర్థాలకు మూలం
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన: ఎమ్మెల్యే శంకర్ నాయక్
దంతాలపల్లి ఆగస్ట్ 24 జనం సాక్షి
క్షణికావేశాలకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, సంయమనం పాటిస్తే సమస్యలు సర్దుబాటు అవుతాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని బొడ్లాడ గ్రామానికి చెందిన జనిగల వెంకన్న ఇటీవల తన అల్లుడి చేతిలో హత్యకు గురవడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మృతుని ఇంటికి వచ్చి ఆయన ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యుల పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మృతుని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ చిట్టి మధుసూదన్ రెడ్డి, నెల్లికుదురు జడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పరిపాటి వెంకటరెడ్డి,జెల్ల వెంకటేష్ పార్టీ నాయకులు చిట్టి రమేష్ రెడ్డి జనిగల వెంకన్న, పిఎసిఎస్ డైరెక్టర్ జనిగల అశోక్, బొడ్డు పెళ్లి వెంకన్న ,కొత్తపెల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు.