మావోయిస్టుల ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం

పినపాక నియోజకవర్గం ఆగస్టు 24 (జనం సాక్షి): భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు మణుగూరు సి ఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో బుధవారం మణుగూరు మండలం పరిసర గ్రామాలలో గోడ పత్రికను అంటించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, వారికి ఎవరైనా సహాయ సహకారాలు అందించినచో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. మావోయిస్టుల ఆచూకీ తెలిసినవారు పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని అన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని, వారికి తగిన పారిదోషకం ఇవ్వబడునని తెలిపారు.