క్షయ వ్యాధి నిర్మూలన కు కృషి చేయాలి
జహీరాబాద్ సెప్టెంబర్ 9 (జనంసాక్షి)జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ మండలం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన సంస్థ, టీబి అలర్ట్ ఇండియా వారి ఆధ్వర్యంలో కోహిర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పరీక్షలు నిర్వహించడం జరిగింది. క్షయ వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి దానిని అరికట్టే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క క్యాంపును నిర్వహించడమైనది. కోహీర్ మండల పరిధిలో గల గ్రామాలకు సంబంధిoచిన 179 మంది ప్రజాలకు పరీక్షలు చేసి క్షయ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ రాజేశ్వరి, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రాజ్ కుమార్,టీబి అలర్ట్ ఇండియా సంస్థ నిర్వహిస్తున్న బ్రేక్ ఇంద బ్యారీయర్ సంస్థ ప్ప్రోగ్రాం మానేజర్ పి. పురుషోత్తం, జహీరాబాద్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ శ్రీనివాస్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ కబీర్,టీబిహెచ్ వి,శ్రావణ్ టీబి అలర్ట్ సంస్థ సిబ్బంది పి.కృష్ణ, బి. అనిల్ , నర్సింలు ,సూపర్వైజర్లు ఏఎన్ఎం, ఆశా వర్కర్లు.తదితరులు పాల్గొన్నారు.