పోలీస్ నియామకాల్లో ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం
జహీరాబాద్ సెప్టెంబర్ 9 (జనం సాక్షి) ఎస్సై,కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదని బిఎస్పీ రాష్ట్ర నాయకులు సిద్దు రావన్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణం లోని స్థానిక కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ హోంమంత్రి మహమ్మద్ అలీ, డిజిపి మహేందర్ రెడ్డి రాజ్యాంగ పదవుల్లో ఉంటూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోలీస్ నియామకాలు చేపట్టడం సిగ్గు చేటన్నారు.ఓసి అభ్యర్థులకు కటాఫ్ మార్కులను 80నుండి 60కి తగ్గించారని అదేవిధంగా బీసీ లకు 50 ,ఎస్సీ, ఎస్టీ లకు 40 కటాఫ్ మార్కులను తగ్గించాలాని డిమాండ్ చేశారు. పరీక్షల్లో నెగిటివ్ మార్కులను ఎత్తివేయాలని అన్నారు. ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పులను సరిచేసి వాటికి తగిన మార్కులను కలిపి అభ్యర్థులకు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. అభ్యర్థుల న్యాయం చేయకపోతే బీఎస్పీ ఆద్వర్యం లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, పి బాబు రావు జిల్లా ఇంచార్జ్, ఎక్బల్ జిల్లా కార్యదర్శి, రాహుల్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.