క్షుద్ర పూజ లే జంట హత్యలకు కారణం.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్18.
ఉప్పల్ హనుమాన్ నగర్ లో జరిగిన తండ్రీ కొడుకు ను హత్య చేసిన నిందితులను ఉప్పల్ పోలీసులు, ఎస్వోటీ మల్కాజిగిరి పోలీసుల సహకారంతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేరెడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 14న ఉదయం గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు తండ్రి కొడుకులను హత్యచేసి పరారయ్యారని పోలీసులకు సమాచారం అందింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం,ఐటీ సెల్, డాగ్ స్క్వాడ్,ఎస్వోటీ పోలీసులను రంగంలోకి దింపి సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నామని తెలిపారు.ఉప్పల్ హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్న నరసింల నరసింహ (75) వృత్తిరీత్యా బ్రాహ్మణుడు ఇతను వాస్తు,పూజలు,జాతకాలు చెప్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు.క్రమంలో బాలాపూర్ మామిడి పల్లి కి చెందిన లిక్కి వినయ్ యోగేంద్ర రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు.

బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి జాతకం ఆడిగాడు.మీఇంటిలో పూజలు చేస్తే సమస్యలు తీరుతాయని పూజారి నమ్మించి వారి ఇంటిలో పూజలు చేశాడు. పూజలు చేయడంతో అప్పుగా ఇచ్చిన మొండి బకాయిలు తిరిగి వచ్చాయి. నేను పూజలు చేస్తేనే డబ్బులు వచ్చాయని బ్రాహ్మణుడు కమీషన్ వసూలు చేశాడు.క్షుద్ర పూజలు నమ్మిన యోగేంద్ర రెడ్డి ప్రతి చిన్న విషయానికి బ్రాహ్మణుల చేత పూజలు చేయించేవారు.ఎన్ని పూజలు చేసిన వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులు ఎక్కువ అయ్యాయని అతని స్నేహితుడు బాలకృష్ణకు వివరించాడు.బ్రాహ్మణుడు పూజలు చేయడంతోనే ఇలా జరిగిందని బ్రాహ్మణుని ఎలాగైనా చంపాలని పథకం వేసి వీరి స్నేహితులైన జగదీష్ గౌడ్, గన్వయ రాము,గైక్వాడ్ శ్యాంసుందర్ తో కలిసి వారం రోజులు ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించి నరసింహను కత్తులతో పొడిచి చంపు తుండగా నరసింహ కొడుకు శ్రీనివాస్ అడ్డురావడంతో ఇద్దరి ని హత్య చేసి పరారయ్యారు.వీరితో పాటు వీరికి సహకరించిన ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని తెలిపారు.

Attachments area