Thursday, 5 November 2026

పద్మారావు నగర్ పెట్రోల్ బంకులో ఘర్షణ.. గర్భిణీ తో పాటు పెట్రోల్ బంక్ సిబ్బందికి గాయాలు.

  సికింద్రాబాద్ (జనం సాక్షి )      పద్మారావు నగర్ పెట్రోల్ బంక్ లో ఘర్షణ.. ఇద్దరి తలలు పగులగా. గర్భిణీ స్ట్రీకి గాయాలు. హాస్పిటల్ కు తరలింపు. పెట్రోల్   బాంక్ లో  ప్రత్యక్ష  సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం   పెట్రోల్ పోయించుకోడానికి వచ్చిన వాహణదారుడ్ని క్యూ లైన్ లో రమ్మన్నడంతో సిబ్బందిపై దాడి   దిగాడు.  పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న  సిబ్బంది  ప్రతిఘటించడంతో రెచ్చిపోయిన వాహణదారుడు తన హెల్మెట్ తో, అక్కడే దొరికిన దుడ్డు కర్రతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో రణరంగంగా  మారిన పెట్రోల్ బంక్.   ఈ దాడిలో ఇద్దరు సిబ్బంది తలలు పగిలి రక్తస్రావం కాగా  పెట్రోల్ కోసం వచ్చిన వాహన దారులతో పాటు ఒక గర్భిణీ మహిళకు గాయాలయ్యాయి.. విషయం తెలుసుకున్న చిలకలగూడా పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తరలించారు..    .   కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీ లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  30 నిమిషాల పాటు   పెట్రోల్ బంక్  ముందు   ఇక్కడి వాహనాలు అక్కడే నిలిచిన జన సమూహంగా   మారింది
Attachments area