వాణిజ్యపంటగా అభివృద్దికి అవకాశాలు
హైదరాబాద్,జూన్29(జనం సాక్షి ): ఎక్కడోఒ ఎడారి దేశాల్లో పండే ఖర్జూర ఇప్పుడు తెలంగాణలోనూ పండించేందుకు చర్యలు తీసుకున్నారు. నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈ పంట విస్తీర్ణం పెరిగింది. ఖర్జూర సాగుకు 75శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఉద్యాన శాఖ ప్రకటించింది. ఖర్జూర అత్యంత విలువైన పౌష్టికాహారం కావడంతో దానికి నిరంతరంగా మార్కెటింగ్ ఉంటుందని అధికారులు అన్నారు. నల్గొండ మండలం నర్సింగ్‌భట్లలో సాగవుతున్న ఖర్జూరా పంటను పరిశీలించారు. భూ యజమానిని అడిగి పంట వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. చెట్లు కాతకు వచ్చే వరకు రైతులకు సహకారం అందిస్తామని స్పష్టంచేశారు. ఏటా సుమారు రూ.1000కోట్ల వరకు ఖర్జూరా విక్రయాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. అర్హత ఉన్న వారందరికీ డ్రిప్ పరికరాలు అందజేస్తామని చెప్పారు. పలువురు రైతులు మాట్లాడుతూ ఫాంపౌండ్లు మంజూరు చేయాలని, మొక్కలను ట్రేలలో పెంచి పంపిణీ చేయాలని కోరారు. ఇకపోతే జిల్లాలో అంతరించిపోతున్న అడవులను పెంపొందించు కోవడం కోసం ప్రజలు విత్తనబంతులను రికార్డు స్థాయిలో తయారు చేశారు. ఒక్కో గ్రామానికి 50వేలచొప్పున విత్తన బంతులను తయారు చేయాలని ఆదేశించగా అందుకు అనుగుణంగా అటవీ అధికారులు కార్యాచరణచేపట్టారు. చిన్నచిన్న గ్రామాల్లో లక్షలో విత్తనబంతులను తయారు చేసి అధికారుల అభినందనలు పొందారు. జిల్లాలో అడవులను పెంచడానికి సీడ్‌బాల్స్ తయారీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలు భాగస్వామ్యంతో కొనసాగించారు. ప్రజల ఉత్సాహంతో భావితరాలకు అడవులను స్ఫూర్తినివ్వడానికి విత్తనబంతులను తయారు చేయాడానికి సిద్ధమయ్యారు




