Tuesday, 3 November 2026

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే పంజాబ్ నేషనల్ బ్యాంకు లక్ష్యము : జోనల్ మేనేజర్ మహమ్మద్ మక్సూ ద్ అలీ

  పంజాబ్ నేషనల్ బ్యాంక్  బి.  యన్.రెడ్డి నగర్  68వ బ్రాంచ్ ప్రారంభోత్సవం
  ఎల్బీనగర్ (జనం సాక్షి )   ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే పంజాబ్ నేషనల్ బ్యాంకు లక్ష్యమని పంజాబ్ నేషనల్ బ్యాంక్   జోనల్ మేనేజర్ మహమ్మద్ మక్సూ ద్ అలీ   అన్నారు.   శుక్రవారం నాడు   ఎల్బీనగర్ నియోజకవర్గం లోని సాగర్ రోడ్డులో  నూతనంగా ఏర్పాటు చేసిన  పంజాబ్ నేషనల్ బ్యాంక్    ( బియన్ రెడ్డి నగర్  )  బ్రాంచ్ ని,  పంజాబ్ నేషనల్ జోనల్ మేనేజర్ మహమ్మద్ మక్సూద్ అలీ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజల్వన చేసి రిబ్బన్ కట్ చేసి   ప్రారంభించడం జరిగింది.  అనంతరం ముగ్గురు లబ్ధిదారులకు హౌసింగ్ లోన్స్ అందించడం జరిగింది  .  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే పంజాబ్ నేషనల్ బ్యాంకు లక్ష్యమని అన్నారు. మా బ్యాంకులో డిజిటలైజేషన్    సేవలుఅందుబాటులో    ఉన్నాయని   ,  అదేవిధంగా గోల్డ్ లోన్స్ సౌకర్యం   అందుబాటులో ఉన్నాయని తెలిపారు  .  అనంతరం  బ్యాంకు ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు  బ్యాంకు సిబ్బంది అధికారులు బోకేలు అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు  .   కార్యక్రమంలో   పంజాబ్ నేషనల్ బ్యాంకు హైదరాబాద్  హెడ్  ఎన్ వి ఎస్పి  రెడ్డి ,  బ్రాంచ్ మేనేజర్ వినోద్ కుమార్,  బ్యాంక్  అధికారులు   మహ్మద్ భాషా , కరుణ బ్యాంక్ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.