Tuesday, 3 November 2026

మంత్రి మేయర్ ఆదిపత్య పోరు లో ఆగిపోతున్న అభివృద్ధి :భారతీయ జనతా యువమోర్చా కార్యవర్గ సభ్యులు శూరకర్ణ రెడ్డి

ఎల్బీ నగర్( జనం సాక్షి  )రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ల మధ్య ఆదిపత్య పోరుతో అభివృద్ధి ఆగిపోతుందని భారతీయ జనతా యువమోర్చా కార్యవర్గ సభ్యులు శూరకర్ణ రెడ్డి అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ బడంగ్ పేటలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ కార్పొరేషన్ మేయర్  పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని వీరిద్దరి మధ్యన అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కు బడ్జెట్ గత 6నెలలుగా ఇంతవరకు విడుదల కాలేదని కార్పొరేషన్ లో తీర్మానం చేసి బడ్జెట్ ఆమోదం పొందిన బడ్జెట్ విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు .. అటుమంత్రి ఇటు మేయర్ మధ్య ప్రజలు నలిగిపోతున్నారని దీనితో అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కార్పొరేషన్ బడ్జెట్ విడుదల చేసి అభివృద్ధి కార్యక్రమాల వైపు దృష్టి సారించాలని ఆయన కోరారు.
24 కోట్ల రూపాయలతో మూడవ వార్డు అల్మాగుడ లో చేపట్టిన ట్రంకు లైను వరదనీటి కాలువ పనులను నాలుగు నెలల నుండి గుత్తేదారు వదిలివేసి వెళ్లడంతో ఎక్కడి పనులు అక్కడే అనే చందంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయింది. మేయర్ పారిజాతకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి మధ్య ఆదిపత్య పోరుతో సీఎంఆర్, ఆర్ ఎం ఆర్, ఎన్ జె ఆర్, సి వై ఆర్ కాలనీలలో చెరువు నుంచి వస్తున్న నీటితో భుగర్భ జలాలు కలుషితమై బోర్లో డ్రైనేజీ వాటర్ రావడం తో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు.నాచు ఏర్పడి రహదారులపై వాహనదారులు కిందపడి ప్రమాదాలకు గురి అవుతున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని  కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ రహదారిలో ప్రయాణం చేయాలంటే నరకం అనుభవిస్తున్నారని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అభివృద్ధికి ఆటంకం కల్పిచోధని ఇద్దరిని  శూరకర్ణ రెడ్డి డిమాండ్ చేశారు.
Attachments area