Tuesday, 3 November 2026

ఖేడ్ తెరాసలో మొదలైన “యుద్ధం”

-కమీషన్ వసూలు చేస్తున్న ఎమ్మెల్యే -ఎఎమ్సీ చైర్మెన్ హనుమంతు

-అధికార పార్టీలో అలజడి

నారాయణఖేడ్-(జనంసాక్షి):సంగారెడ్డి జిల్లాలో మారుమూల నియోజకవర్గమైన నారాయణఖేడ్ రాజకీయాలు ఎప్పడు ప్రత్యేకంగానే ఉంటాయి. తాజాగా అధికార తెరాస పార్టీ నేతల మద్య జరుగుతున్న మాటలయుద్దం ఏవిధమైన మలుపులుంటాయోనని ఖేడ్ ప్రాంత ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.ఆదివారం మార్కెట్ కమిటీ చైర్మన్ బిడెకన్నే హన్మంతు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు.తన మార్కేట్ కమిటీ చైర్మన్ సిఫార్సు లేఖ కోసం ఎమ్మెల్యే పది లక్షలు తీసుకున్నారన్నారు.నియోజకవర్గంలో ఏ విధమైన పనులు చెపట్టాలన్నా ఎమ్మెల్యేకు కమీషన్ ఇవ్వాల్సిందేనన్నారు.గ్రామాల్లో సర్పంచ్ లు చేపట్టే అభివృద్ధి పనులను సైతం సక్రమంగా చేయనీయకుండా,బిల్లులు రాకుండా అడ్డుపడుతున్నిరన్నారు.ఎమ్మెల్యే కు ముడుపులు ఇస్తే తప్ప బిల్లులు రావడంలేదని పలువురు సర్పంచ్ లు వాపోతున్నారన్నారు. పార్టీ అదిష్టానం ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని,లేకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.