Tuesday, 3 November 2026

ఖైరతాబాద్‌ ఆర్టీఏలో రాంచరణ్‌ దంపతులు

 హైదరాబాద్‌ సిటీ : ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు కోసం హీరో రాంచరణ్‌ దంపతులు ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి బుధవారం వచ్చారు. లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారు ఫొటోలు దిగడంతో పాటు డిజిటల్‌ సంతకాలు, వేలి ముద్రలను ఆర్టీఏ అధికారులు తీసుకున్నారు. ఏడాది పాటు కాలపరిమితి ఉండే ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్సును జారీ చేయనున్నామని ఆర్టీఓ డి.దశరథం తెలిపారు. రాంచరణ్‌ రాకతో ఆర్టీఏ కార్యాలయంలో సందడి నెలకొంది. ఆయనతో ఫొటోలు దిగేందుకు పలువురు ఆసక్తి కనబర్చారు. రద్దీ తక్కువగా ఉండే సమయంలో రావాలని అధికారులు సూచించడంతో మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో హీరో రాంచ రణ్‌ ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *