Tuesday, 3 November 2026

వికలాంగులు, మూగ చెవిటి అభ్యర్థులకు ఉచిత ఉపాధి శిక్షణ

గుంటూరు(విద్య): జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో వికలాంగులు, మూగ చెవిటి అభ్యర్థులకు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్‌డీఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 40శాతం అంగవైకల్యం ఉన్నవారు ఇందుకు అర్హులని తెలిపారు. పదవ తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌ అయి ఉండి 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారు అర్హులని తెలిపారు. రెండు నెలల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. అదే విధంగా బీపీవో కోర్సుకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇతర వివరాల కోసం ఈనెల 29న కలెక్టరేట్‌ (ఫొన్‌నం.0863-2241753,2210757)ఎదురుగా ఉన్న ప్లేస్‌మెంట్‌సెల్‌లో సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *