ముస్తాబాద్ ఆగస్టు 7 జనం సాక్షి
ముస్తాబాద్ మండల పోతుగల్ ముస్తాబాద్ రెండు గ్రామాల గంగపుత్ర సభ్యులు మరియు పోతుగల్ గంగపుత్ర సభ్యుల ఆధ్వర్యంలో ముస్తాబాద్ పెద్ద చెరువు ఛీకోడ్ చెరువు, వెంకయ్యకుంట,పులి చేరుకుంట, లింగం కుంట మరియు పల్లె కుంట లో ఒక లక్షా యాబై వేల రూపాయల విలువ చేసే పది లక్షల చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులలో వదిలినాము. సభ్యులు చెప్పారు ప్రతి సంవత్సరం ఇలాగే కొనుగోలు చేసి చేపపిల్లలను వదులుతున్నాను కానీ గంగపుత్రులకు సరైన ఉపాధి కలుగుట లేదు. రాష్ట్ర ప్రభుత్వం గంగపుత్రులకు ఉపాధి చూపించాలని కోరుతున్నారు ఈ చెరువుల లో దాదాపుగా 200 మంది గంగపుత్ర సభ్యులు ఆధారపడి జీవిస్తున్నారు. కావున గంగపుత్రులకు గవర్నమెంటు ఆదుకుని గంగపుత్ర జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషిచేయాలని కోరుచున్నాము. అన్నారు ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పోతుగల్ గంగపుత్రుల సంఘ సభ్యులు పాల్గొన్నారు




