గంపొనిపల్లే గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రెడ్ క్రాస్
ములుగు జూలై (జనం సాక్షి):-
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని నల్లగుంట,గంపోనిపల్లే గ్రామం లో భారీ వర్షాల వల్ల ఇండ్లు కూలిన వారికి నల్ల గుంట సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో లో రెడ్ క్రాస్ వారు సహకారం తో ఇంటి పై కవర్ మరియు 20 కిలోల బియ్యం మరియు అమ్మాయిలకు శానిటేషన్ కిట్ పంపిణీ చేశారు.అవి 1) తార్పాలిన్ కవర్స్,
2)హైజెనిక్ కిట్స్,
3)మాస్కులు-100,
బియ్యం -4 క్వింటాళ్ల 60 కిలోలు ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కొత్తపల్లి ప్రసాదరావు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ
రాష్ట్ర పాలక మండలి సభ్యుడు (ములుగు జిల్లా),ఎంఆర్ఓ మంజుల,గ్రామ ఉప సర్పంచ్ భూక్యా శంకర్,పంచాయతీ కార్యదర్శి తీగల రజిత,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area