గడపగడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం

రాయికల్, నవంబర్11(జనం సాక్షి)రాయికల్ పట్టణంలోని స్థానిక 12 వార్డులో కాంగ్రెస్ శ్రేణులు గడపగడపకు ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేష్, నాయకులు పొన్నం శ్రీకాంత్, వాసం దిలీప్, కడకుంట్ల నరేష్, కట్కం మధుకర్ తదితరులు పాల్గొన్నారు.