Tuesday, 3 November 2026

గడపగడపకు బిఆర్ఎస్.. సిరిసిల్ల పట్టణంలో విస్తృత ప్రచారం

గడపగడపకు బిఆర్ఎస్.. సిరిసిల్ల పట్టణంలో విస్తృత ప్రచారం

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 7. (జనంసాక్షి). సిరిసిల్ల పట్టణంలో గడపగడపకు టిఆర్ఎస్ కార్యక్రమం విస్తృతంగా జరుగుతుంది. మంగళవారం బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వార్డులలో గడపగడపకు బిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న విషయాలను దృష్టిలో ఉంచుకొని బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.