గడప గడపకు బిజెపి ప్రచార కార్యక్రమం

గడప గడపకు బిజెపి ప్రచార కార్యక్రమం

రాయికల్, నవంబర్ 06 (జనంసాక్షి) గడపగడపకు బిజెపి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించిన పట్టణ బిజెపి శ్రేణులు. ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రెటరీ ధర్మపురి, టౌన్ ఉపాధ్యక్షులు కునారపు భూమేష్, కార్యదర్శి సామల్ల సతీష్, కిసాన్ మోర్చా కుర్మ మల్లారెడ్డి, బూత్ అధ్యక్షులు దాసరి రవి, వేముల రవికాంతం, దాసరి సంతోష్, బీజేవైఎం సెక్రటరీ చిలివేరి ప్రవీణ్, ఉపాధ్యక్షులు నరేష్, ప్రదీప్, గోపి తదితరులు బిజెపి కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు