-తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి – ఎర్ర రమేష్.
మల్లాపూర్ జనవరి25 (జనం సాక్షి)భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమల్లోకి వచ్చిన తేదీని గుర్తుపెట్టుకుని మన దేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ 26 నవంబర్ 1949న ఆమోదించింది మరియు 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. 1930లో భారత స్వాతంత్ర్య ప్రకటన ప్రకటించిన ఆ రోజున జనవరి 26ని గణతంత్ర దినోత్సవానికి తేదీగా ఎంచుకున్నారు. కావున స్వతంత్ర భారతదేశానికి నూతన రాజ్యాంగం ద్వారా దశ దిశను చూపి ప్రపంచంలోనే అతిగొప్ప లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానీయుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని గణతంత్ర దినోత్సవ వేడుకలలో తప్పకుండా పెట్టాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర రమేష్ గారు తెలపడం జరిగింది.




